
కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు కేటాయించడంపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఆ నిధులు కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని ఆ కేసుల్లో భూ సేకరణ పరిహారం చెల్లింపునకు అని సీఎస్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సోమేశ్ కుమార్ ఆ వివరణలో పేర్కొన్నారు. జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉద్దేశం ఏమిటి? కాగితంపై రాసిందేంటని ప్రశ్నించింది. ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమే అన్నట్లుగానే జీవో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.