
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్సింగ్స్ లో ఇంగ్లాండ్ లంచ్ సమయానికి 25 ఓవర్లలో 61/2 స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (0) ను బుమ్రా పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్ క్రాలే(27) తో కలిసి ఓపెనర్ సిబ్లీ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. సిరాజ్ వేసిన 21వ ఓవర్లో చివరి బంతికి జాక్ క్రాలే రిషబ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుం జో రూట్ (12), సిబ్లీ(18) క్రీజులో ఉన్నారు.