కట్ చేస్తే.. శివరాజు, వెంకట్రాజు సుబ్బయ్యకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దర్శకుడు సుబ్బయ్యకి భూపతిరాజా మంచి స్నేహితుడు. ‘పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాం, మంచి కథ కావాలి’ అంటే.. భూపతి రాజా ‘పవిత్రబంధం’ కథ చెప్పాడు. పాయింట్ అందరికి నచ్చింది. ఈ కథతో సినిమా తీసి హిట్ చేయొచ్చు అనే నమ్మకం పెరిగింది సుబ్బయ్యలో.
అయితే, భూపతిరాజా చెప్పిన కథ నిర్మాతలు శివరాజు, వెంకట్రాజులకు అసలు నచ్చలేదు. ఫ్యామిలీ హీరో వెంకటేష్ కి ఆ లైన్ సూట్ కాదేమో అని వారి భయం. అందుకే, ఆ కథను వేరే హీరోతో చేద్దాం, వెంకటేష్ బాబుతో ఇంకో ఫ్యామిలీ కథ చేద్దాం అని పట్టుబట్టారు. ‘పాయింట్ బాగుంది. దీని మీద బాగా వర్క్ చేస్తాం, కచ్చితంగా ఇది వైవిధ్యమైన కథ.. తప్పకుండా మనకు మంచి పేరు వస్తోంది’ అంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు సుబ్బయ్యగారు.
దర్శకుడి మాట కాదు అనలేక డెవలప్ చేసిన తర్వాత చూద్దాం’ అంటూ నిర్మాతలు మాట దాటవేశారు. వెంకటేష్ కోసం మరో కథ వెతుకులాటలో పడ్డారు నిర్మాతలు. ఈ లోపు కథ పై కుస్తీలు పట్టారు దర్శక రచయితలు. కానీ, ఈ కథతో వెంకటేష్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తిగా లేరు. కాబట్టి, కథను చాటుగా సురేశ్‌బాబుకి వినిపించారు సుబ్బయ్య. సింగిల్ సిట్టింగ్‌లో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేష్.
నిర్మాతలు షాక్. అయినా చాల సంతోషపడ్డారు. ఆర్టిస్టుల సెలెక్షన్స్ ప్రారంభించారు. ఈ కథలో హీరోయిన్ అంటే.. పెద్ద హీరోయిన్ ఉండాలి అని రకరకాల పేర్లు చెప్పారు నిర్మాతలు. అందులో రమ్యకృష్ణ పేరును ఫైనల్ చేసుకున్నారు. కానీ, దర్శకుడు సుబ్బయ్య మదిలో సౌందర్య ఉంది. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది అని ఆయన భావించారు. అలా చివరి సమయంలో రమ్యకృష్ణ ప్లేస్ లో సౌందర్య వచ్చింది. మొత్తానికి వెంకీ – సౌందర్య ఇద్దరూ అనుకోకుండా నటించి.. గొప్ప వెండితెర జంటగా పేరు తెచ్చుకున్నారు.