
రాజధానిలో చేసేది ఫొటో ఉద్యమం మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. శనివారం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ రైతులెవరూ తమ సమస్యలపై తనను కలవలేదన్నారు. రైతులు వచ్చి కలిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.