
తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 8061 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,19,666కి చేరింది. ఇందులో 3,45,683 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 72,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజులో 56 మంది చనిపోయారు.