
గతంలో బ్లాక్ ఫంగస్ కేసు ఆర్నెళ్లకో, ఏడాదికో ఒకటి వచ్చేదని ఇప్పడు కరోనా కరణాంగా భారీగా నమోదవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నగరంలోని కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిని ఆయన ఈ ఉదయం సందర్శించారు. బ్లాక్ ఫంగస్ వార్డులో బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై ఆయన ఆరా తీశారు. బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్స కోసం వాడే ఇంజక్షన్ల కొరత ఏర్పడటం వాస్తవమని.. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధపాతిపదికన పని చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు.