
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆస్తులకు రక్షణ విషయంలో ప్రభుత్వాలు అప్ డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భూ తగాదాలు లేని భవిష్యత్ తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.