
త్వరలోనే విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ప్రారంభమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో కలిసి బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు అన్ని త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు. రాజధాని తరలించే తేదీ మాత్రం అడగవద్దని మీడియాను కోరారు. విశాఖను మురికి వాడలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.