
వాతావరణ పరిరక్షణ కోసం భారత దేశం, స్వీడన్ ప్రారంభించిన నాయకత్వ బృందంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని భారత దేశ ప్రధాన మంత్రి కార్యాలయం స్వాగతించింది. 2050 నాటికి పరిశ్రమల నుంచి కార్బన్ ఉద్గారాలు వెలువవకుండా చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్న దేశాలు కంపెనీలను ఒకే గొడుగు క్రిందకు తేవడం కోసం లీడర్ పిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ ప్రారంభించారు