
ఇండియాకు 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అందించడానికి తమ మెడికల్ స్లపయర్స్ ఓవర్ టైమ్ పని చేస్తున్నారని చైనా చెప్పింది. ఇండియా కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఇండియాకు చైనా రాయబరి అయిన సన్ వీడాంగ్ ఓ ట్వీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాకు సాయం చేస్తున్నామని ప్రకటించగానే చైనా కూడా హుటాహుటిన ఈ ప్రకటన చేయడం విశేషం.