
భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ చట్టాలకు లోబడే తాము పనిచేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి కొత్త ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక చట్టాలకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు అనుగుణంగా తాము సేవలు అందించనున్నట్లు సీఈవో పిచాయ్ తెలిపారు.