Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధించాలని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపైతే వస్తుంది. వాళ్లు మాత్రమే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ నాన్న అయిన కృష్ణ గారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టాయనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా ఆయనకు గొప్ప గుర్తింపుని తీసుకురావడమే కాకుండా ఆయన స్థాయిని పెంచుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు (Balayya Babu) సైతం మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక బాలయ్య బాబు-మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది.
Also Read : మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం పోటీపడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్…
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా రాకుండా పోయింది. ఇక మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో బాలయ్య బాబు నటింపజేయాలని ఆయన కోసం దర్శకుడు ఆయన కోసం ఒక సపరేట్ ట్రాక్ అయితే రాసారట.
కానీ బాలయ్య బాబు దానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ ట్రాక్ మొత్తాన్ని సినిమా నుంచి తీసేసినట్టుగా అప్పట్లో సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి మొత్తానికి అయితే బాలయ్య బాబు మహేష్ బాబు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
బాలయ్య సైతం వరుసగా మాస్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను దక్కించుకున్న ఆయన రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు…