https://oktelugu.com/

‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

మా ఎన్నికలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయమని పరిశ్రమ పెద్దలే తనని కోరారు. అయితే ఆ సమయంలో పోటీలో ఎవరూ నిలబడలేదని, ఇప్పుడు కొంతమంది పోటీలోకి వచ్చారని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి నారాయణరావు వంటి పెద్దలు ఉన్నప్పుడు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందు ఉండేవాళ్లని కానీ ఇప్పుడు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు అంటూ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. కొంతమంది జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని.. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 21, 2021 / 02:52 PM IST
    Follow us on

    మా ఎన్నికలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయమని పరిశ్రమ పెద్దలే తనని కోరారు. అయితే ఆ సమయంలో పోటీలో ఎవరూ నిలబడలేదని, ఇప్పుడు కొంతమంది పోటీలోకి వచ్చారని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి నారాయణరావు వంటి పెద్దలు ఉన్నప్పుడు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందు ఉండేవాళ్లని కానీ ఇప్పుడు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు అంటూ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. కొంతమంది జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని.. వాళ్లు కనుక శ్రుతి మించి మాట్లాడితే తప్పకుండా వాళ్ల పేర్లు బయటపెడతానంటూ విష్ణు హెచ్చరించారు.