
దేశంలో కరోనా వైరస్ కేవలం భారత్ కే కాకుండా ప్రపంచం మొత్తానికీ ప్రమాదం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొవిడ్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోవడం వల్లే మమమ్మారి సునామీలా విరుచుకుపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు కొవిడ్ కట్టడికి పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి భయానకంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్ని కాపాడేందుకు చేయాల్సిన ప్రతి చర్య అమలు చేయాలని రాహుల్ ప్రధానిని కోరారు.