పుట్ట మధు మిస్సింగ్.. ఏమైంది? ఎక్కడున్నాడు?

ఐదు రోజులుగా అదృశ్యం మంత్రులను కలిసిన భార్య శైలజ ఆచూకీ చెప్పాలని వేడుకోలు రాష్ర్ట రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ పై వేటు వేసిన రోజే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటల రాజేందర్ అనుచరుడిగా ఉన్న పుట్ట మధుపై సైతం భూకబ్జా ఆరోపణలతో పాటు గత ఫిబ్రవరిలో హత్యకు గురైన వామన్ రావు దంపతుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. […]

Written By: Srinivas, Updated On : May 7, 2021 4:35 pm
Follow us on

ఐదు రోజులుగా అదృశ్యం
మంత్రులను కలిసిన భార్య శైలజ
ఆచూకీ చెప్పాలని వేడుకోలు

రాష్ర్ట రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ పై వేటు వేసిన రోజే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటల రాజేందర్ అనుచరుడిగా ఉన్న పుట్ట మధుపై సైతం భూకబ్జా ఆరోపణలతో పాటు గత ఫిబ్రవరిలో హత్యకు గురైన వామన్ రావు దంపతుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తెరమరుగు కావడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్ట మధుపై గతంలో కూడా భూకబ్జా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పి..
ఐదు రోజుల క్రితం పెద్దపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిన మధు తరువాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కదలికలపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో భార్య శైలజ ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ వెళ్లేటప్పుడు ప్రభుత్వ వాహనంలో కాకుండా తన భార్య కారులో ప్రయాణించినట్లు తెలుస్తోంది.

ఎవరా పోలీస్ ఉన్నతాధికారి?
అడ్వకేట్ దంపతులు వామన్ రావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పుట్ట మధుకు ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫోన్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఎవరా పోలీస్ అధికారి? ఆయన ఏం మాట్లాడారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీంతో అసలేం జరిగిందనే దానిపై ఖచ్చితమైన సమాచారమేది అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఆయన భార్య శైలజ సైతం మధు ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

మహారాష్ర్టలో ఉన్నారా?
పుట్ట మధు కదలికలు మహారాష్ర్టలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అక్కడ ఉన్న తమ బంధువుల ఇళ్లలో ఉన్నారని తెలిసింది. చివరి కాల్ కూడా అక్కడి నుంచే వచ్చినట్లు చెబుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్ పోస్టు వద్ద ఆయన గన్ మెన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాష్ర్ట రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న పుట్ట మధు వ్యవహారంపై అందరూ దృష్టి సారించారు. అసలేం జరిగింది? ఏమైనట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకీ అదృశ్యం
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటల రాజేందర్ అనుచరుడిగా పేరున్న మధు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మధు తదనంతర పరిణామాల నేపథ్యంలో శాసనసభ్యుడిగా ఓటమి చవిచూసినా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ గా పదవి సాధించి తన ఉనికిని చాటుకున్నారు. ఏదిఏమైనా పుట్టమధు అదృశ్యంపై మిస్టరీ నెలకొంది.