
ఇంగ్లండ్ టూర్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేసి కోహ్లీ అందరూ జాగ్రత్తగా ఉండాలని సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్ తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇండియన్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లనుంది. ఆలోపే ఆ టీమ్ లోని ప్లేయర్స్ అందరూ తమ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నారు.