
బీజేపీ తెలంగాణ సీనియర్ నేత విజయశాంతి తాజాగా మరో అంశంపై స్పందించారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామానికి వెళ్లి వరాలు కురిపించడంపై విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. అహనాపెళ్లంట సినిమాలోని కోట శ్రీనివాసరావు కోడి కూర సీన్ కు లింకు పెడుతూ సోషల్ మీడియాలో సెటైర్ వేశారు. అదేదో సినిమాలో కోటా గారి కోడి కథ లెక్కుంది. కేసీఆర్ గారి అంకాపూర్ కమానీ. అయినా ఎక్కడో ఒక ఊరుకెల్లి, జైపూర్ బావర్చి అంటూ హడావుడి చేసి, పిచ్చిమాటలు ప్రసంగించి వాపస్ వస్తే తెలంగాణ పల్లెలన్నీ అభివృద్ధి చెందుతాయా అని విమర్శించారు.