Vijay TVK party : మరో నెల రోజుల్లో తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలు కాబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికలను NDA మరియు ఇండియా కూటములు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉండబోతుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య లో తమిళ సూపర్ స్టార్ విజయ్ TVK పార్టీ కూడా పోటీ చేయబోతుంది. యూత్ ఓటర్స్ తో పాటు, క్రైస్తవ ఓట్లను అత్యధిక శాతం ఈ పార్టీ చీల్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓట్ల చీలిక DMK కి కలిసి వస్తుందా?, లేదా AIDMK కి కలిసి వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సర్వేల లెక్కల ప్రకారం చూస్తే విజయ్ పార్టీ కి 13 శాతం ఓటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇది కాసేపు పక్కన పెడితే విజయ్ రీసెంట్ గానే తమిళ హీరోయిన్ త్రిష తో తనకు రిలేషన్ ఉందనే విషయాన్నీ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే . వీళ్లిద్దరు జంటగా కలిసి తమిళనాడు లో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అంతే కాదు త్రిష కచ్చితంగా TVK పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయబోతుంది అంటూ సోషల్ మీడియా లో గత కొంతకాలంగా ప్రచారం సాగుతూ ఉంది. ఇందులో ఎలాంటి నిజం లేదు కానీ, TVK పార్టీ తరుపున మాత్రం ఆమె ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్రిష దక్షిణ చెన్నై లో ఫిమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ ప్రాంతం లో ఆమె ఎక్కువగా తిరిగే అవకాశాలు ఉన్నాయట. విజయ్ అన్ని స్థానాల్లోనూ తిరగడం కష్టం కాబట్టి, త్రిష ఒక 50 స్థానాల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి త్రిష ని తమిళ ప్రజలు అంగీకరిస్తారా ?.
ఎందుకంటే త్రిష, విజయ్ మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయం బయటకు వచ్చినపుడు అభిమానులు సైతం తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ తమ హీరో ని ట్యాగ్ చేసి మరీ తిట్టారు. అలాంటిది ఇప్పుడు త్రిష నేరుగా ఓట్లు అడగడం కోసం గ్రౌండ్ లోకి దిగితే వచ్చే ఓట్లు కూడా పోతాయేమో అని అంటున్నారు విశ్లేషకులు . అంతే కాదు, విజయ్ పైకి పార్టీ కార్యాచరణ లో కనిపిస్తున్నాడు కానీ, వెనుక ఆచరణ మొత్తం త్రిష నే చేస్తుందని, పెద్ద స్థాయి వ్యక్తులతో ఆమె విజయ్ తరుపున చర్చలు కూడా జరుపుతుంది అట. ఇది పేరుకి మాత్రమే విజయ్ పార్టీ అని, వెనుక నుండి రాజకీయం మొత్తం త్రిష నే నడిపిస్తుందని తమిళనాడును లో ప్రచారం జోరుగా సాగుతుంది.