Vijay assets details : తమిళనాడు లో మరో నెలరోజుల్లో ఎన్నికల సమరం జరగబోతోంది. ఈసారి తమిళ రాజకీయాలపై యూత్ ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టింది. ఎందుకంటే తమిళనాడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ TVK పార్టీ ద్వారా పోటీ చేయబోతున్నాడు. నిన్ననే ఈ పార్టీ నుండి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా ని విడుదల చేసాడు విజయ్. తన దగ్గర కారు డ్రైవర్ గా పని చేసే వ్యక్తి కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కదా న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విజయ్ ని పొగుడుతున్నారు . ఇది కాసేపు పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ , చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరహాలోనే రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నాడు. అందులో ఒక స్థానం పెరంబూర్ కాగా, మరొక స్థానం ట్రిచి సిటీ .
నేడు భారీ ర్యాలీ నడుమ అభిమానులతో ఊరేగింపు గా వెళ్లి పెరంబూరు లో ఎన్నికల నామినేషన్ వేసాడు విజయ్. అంతే కాకుండా నేటి నుండే ఆయన ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టేసాడు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆయన సమర్పించిన నామినేషన్స్ పాత్రలలో ఆయన ఆస్తుల వివరాలను చూసి షాక్ అవుతున్నారు నెటిజెన్స్. ఆయన ఆదాయం వివరాలను ఒకసారి పరిశీలిస్తే 2020 – 2021 వరకు 8 కోట్ల రూపాయిలు సంపాదించగా, 2021 – 2022 సంవత్సరానికి 237 కోట్లు, 2022 – 2023 వరకు 198 కోట్లు , 2023 – 2024 వరకు 105 కోట్ల రూపాయిలు, 2024 నుండి 2025 వరకు 184 కోట్ల రూపాయిలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇక ఆస్తుల వివరాల్లోకి వెళ్తే మూవబుల్ అస్సట్స్ 400 కోట్ల రూపాయిలు ఉండగా, నాన్ మూవబుల్ అస్సట్స్ 115 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.
విజయ్ తమిళనాడు లో ప్రస్తుతం స్టార్ స్టేటస్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కనే పెద్దోడు. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ ని నమోదు చేసుకుంటూ ఉంటుంది . అందుకే ఒక్కో సినిమాకు ఆయన 150 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటాడు. వీటితో పాటు ఓటీటీ రైట్స్ మరియు ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి విజయ్ సినిమాకు కనీవినీ ఎరుగని రేట్స్ పలుకుంటూ ఉంటాయి. వాటిల్లో కూడా విజయ్ కి లాభాలు ఉన్నాయి. అవన్నీ ఈ ఎన్నికల అఫిడిఫీట్ లో పొందుపరిచాడు విజయ్. అందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మీకోసం వాటిని అందిస్తున్నాము చూడండి.
#TVK president actor #Vijay files nomination to contest from #Perambur.
His income:
2024-25 – Rs 184.53 crores
2023-24 – Rs 105.69 crores
2022-23 – Rs 198.75 crores
2021-22 – Rs 237.46 crores
2020-21 – Rs 8 crores1/7@xpresstn @NewIndianXpress @TVKVijayHQ pic.twitter.com/dxrwexsmaQ
— S Mannar Mannan (@mannar_mannan) March 30, 2026