Venkatesh son Arjun : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం ‘ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ చాలా వైలెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా మొత్తం వెంకటేష్ యాక్షన్ ఎపిసోడ్స్ లో విపరీతంగా పాల్గొంటారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా త్రివిక్రమ్ మార్కును మించి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయన మొత్తం ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను తీశాడు. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా పెద్ద పీట వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ కూడా ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. చివరి 5 నిమిషాల్లో తను కనిపిస్తారట.
ఎలాగైనా సరే తన కొడుకును హీరోగా మార్చాలనే ప్రయత్నంలో వెంకటేష్ అతనికి యాక్టింగ్ సంబంధించిన మెలకువలు నేర్పిస్తున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ కోరిక మేరకు వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ ను ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చూపించబోతున్నారట. మనం సినిమాలో ఎలాగైతే అఖిల్ వచ్చి చివర్లో వాళ్లందర్నీ కాపాడుతాడో అలాగే ఈ సినిమాలో కూడా అర్జున్ వచ్చి వీళ్ళందర్నీ సేవ్ చేస్తారట.
ఇక విక్టరీ వెంకటేష్ కొడుకు అరంగేట్రం సినిమా ఇదే అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అర్జున్ గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చినా కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడడానికి వెంకటేష్ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఎందుకంటే స్టార్ హీరో అయిన వెంకటేష్ కొడుకు అంటే ఇండస్ట్రీ లో చాలా మంచి అంచనాలైతే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఆయన రాణిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ క్యారెక్టర్ ఉందా? లేదంటే కావాలనే కొన్ని రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది…

