
అమెరికాలోని డెట్రాయిట్ లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కుమారుడు యూఎస్ లో స్థిరపడటంతో హైదరాబాద్ లో ఉండే దయాకర్ రెడ్డి 20 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. వీణవంక, పరిసర ప్రాంతాల్లో భూస్వామిగా పేరొందిన సుధాకర్ రెడ్డి కుమారుడు ఈ దయాకర్ రెడ్డి.