
కరోనా కరణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో భారత తో విదేశీ ఆటగాళ్లందరూ స్వేదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్ లో ఉన్నారు. ఐతే ఐపీఎల్ 2021 లో ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్లో న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు జట్టులో స్థానం లభించకపోవచ్చు. ఆటగాళ్లకు విరామం ఇవ్వాలనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. దీంతో ఐపీఎల్ లో పాల్గొన్న జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, సామ్ కరన్, క్రిస్ వోక్స్, మొయిల్ అలీ, జోస్ బట్లర్ అందరూ ఐపీఎల్ లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడారు. తక్కువ సమయంలో క్వారంటైన్ లో ఉన్న ఆటగాళ్లు టెస్టు సిరీస్ కు సిద్ధమవడం కష్టమేనని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.