ఎంటర్టైన్మెంట్Varun Tej : చేతి కర్ర సాయంతో నడుస్తున్న వరుణ్ తేజ్.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో..

Varun Tej : చేతి కర్ర సాయంతో నడుస్తున్న వరుణ్ తేజ్.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో..

Varun Tej : యంగ్ హీరోల్లో మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో సక్సెస్ ఈయనకు అంత తేలికగా రాలేదు కానీ , ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీ ని షేక్ చేసే సూపర్ హిట్స్ ఎన్నో అందించారు. ఫిదా , తొలిప్రేమ , గడ్డలకొండ గణేష్ , F2 ,F3, ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో హీరో గా నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత ఈయన చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక కెరీర్ ముగిసిపోతుంది అని అనుకుంటున్న సమయంలో ఆయన ప్రకటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 7 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటని ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి వరుణ్ తేజ్ చేతి కర్ర సాయం తో , ఇబ్బంది పడుతూ నడుస్తూ రావడాన్ని చూసిన అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలా ఉండే వరుణ్ తేజ్ , ఎలా అయిపోయారు, ఇంకా ఎంత కాలం ఈ నొప్పితో ఇబ్బంది పడాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ కి ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ‘బరి’ అనే చిత్రమే. ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన యాడు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

గ్రామీణ ఫుట్ బాల్ ఆట నేపథ్యం లో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొని , ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు వరుణ్ తేజ్ కి ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అయితే ఆ తర్వాత సర్జరీ జరిగిందని , వరుణ్ తేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నారని చెప్పారు కానీ , ఆయన ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని నిన్నటి ఈవెంట్ ని చూస్తే అర్థం అవుతోంది. ఈ ఈవెంట్ లో ఆయన చేతి కర్ర సాయంతో చాలా కష్టం మీద నడుచుకుంటూ వచ్చారు. సంఘటన జరిగి నాలుగు నెలలు కావొస్తున్నా, ఇప్పటికీ వరుణ్ తేజ్ పూర్తి స్థాయిలో కోలుకోలేదంటే , దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇబ్బంది పడుతూ నడుస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

https://www.youtube.com/shorts/6frVfgIqTw0

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Korean Kanakaraju Teaser: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రివ్యూ : కాన్సెప్ట్ అదిరింది.. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు!

Korean Kanakaraju Teaser: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత వరుణ్ తేజ్ హీరో గా నటించిన చిత్రం 'కొరియన్ కనకరాజ్'. గతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక...

Varun Tej: వరుణ్ తేజ్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్..

Varun Tej: మేర్లపాక గాంధీ దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన 'కొరియన్ కనకరాజు'. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి వరుణ్ తేజ్ కి ఈ...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Exit mobile version