
ప్రజలను విపరీతంగా వేధిస్తున్న కోవిడ్ మహమ్మారిపై ఈ ఏడాది చివరికల్లా విజయం సాధించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరునాటికి దేశ ప్రజలందరికీ ఇచ్చేందుకు అవసరమైన కోవిడ్ టీకాల మోతాదులు తయారు కాబోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు- డిసెంబరు మధ్య కాలంలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రతి భారతీయునికి టీకా వేసిన తర్వాత చాలా డోసులు మిగిలిపోతాయని చెప్పారు.