
భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రమేష్ పవార్ మళ్లీ ఎంపికయ్యాడు. విమెన్స్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ గా పవార్ ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి గురువారం ప్రకటించింది. కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తు ఆహ్వానించగా 35 మందికి పైగా పోటీ పడ్డారు. సులక్షణ నాయక్, మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్ లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిటీ పవార్ ను మళ్ల కోచ్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.