
కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న సంకేతాల నేపథ్యంలో ముందస్తు చర్యలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పదేళ్ల లోపు పిల్లల తల్లిదండ్రులకు తక్షణ ప్రాధాన్యతా క్రమంగా వ్యాక్సినేషన్ ఇవ్వనుంది. మీడియాకు ఈ విషయాన్ని యోగి ఆదిత్యానథ్ తెలియజేస్తూ, థర్డ్ వేవ్ రాకముందే పదేళ్ల లోపు పిల్లల తల్లిండ్రులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి దేశవ్యాప్తంగా మే 1 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది.