Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Netflix views: 4 రోజుల్లో 25 లక్షల వ్యూస్.. 15 దేశాల్లో...

Ustaad Bhagat Singh Netflix views: 4 రోజుల్లో 25 లక్షల వ్యూస్.. 15 దేశాల్లో ట్రెండింగ్ .. నెట్ ఫ్లిక్స్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సెన్సేషనల్ రెస్పాన్స్..

Ustaad Bhagat Singh Netflix views: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఉగాది కానుకగా మార్చి 19 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కారణంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు , లాంగ్ రన్ అయితే అత్యంత దారుణం , వంద కోట్ల గ్రాస్ […]

Ustaad Bhagat Singh Netflix views: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఉగాది కానుకగా మార్చి 19 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కారణంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు , లాంగ్ రన్ అయితే అత్యంత దారుణం , వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చింది. హరీష్ శంకర్ నాసిరకపు టేకింగ్ , తేరి రీమేక్ అనే ప్రచారం ఈ సినిమా కొంపముంచింది. ప్రతీ సన్నివేశం కూడా ‘అరెరే ..ఇది ఎక్కడో చూశామే..ఆ చిత్రం నుండి కాపీ కొట్టేశాడుగా’ అని చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ తో ఇలంటి నీచపు సినిమా చెయ్యాలని ఎలా అనిపించింది?, అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నాడు , ఇలాంటి సన్నివేశాలు ఎవరైనా స్టార్ హీరో తో తీస్తారా?, తేరి ని మక్కీకి మక్కీ దించినా ఇంత చెత్తగా ఉండేది కాదు కదా అంటూ ఇష్టమొచ్చిన రేంజ్ పోస్టులు పెడుతూ హరీష్ శంకర్ ని ఏకిపారేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో భారీ రేంజ్ లోనే వ్యూస్ సొంతం అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న గణాంకాల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం 4 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది ఒక విధంగా బెస్ట్ రెస్పాన్స్ అనే చెప్పొచ్చు.

ఎందుకంటే ఈ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ , ఏ సినిమాకు కూడా రాలేదు. ‘ఓజీ’ ప్రభావం వల్ల, ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కూడా అత్యధికంగా చూసి ఉంటారని , అందుకే అంతటి వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ‘ఓజీ’ చిత్రానికి మొదటి నాలుగు రోజుల్లో 32 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ‘ఓజీ’ తో పోలిస్తే 7 లక్షల వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ కూడా, వచ్చిన ఫ్లాప్ టాక్ కి ఈ మాత్రం రావడం చాలా గ్రేట్ అని అంటున్నారు. అంతే కాదు , ప్రస్తుతానికి ఈ చిత్రం 15 దేశాల్లో ట్రెండ్ అవుతోంది. రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper