spot_img
Homeఅంతర్జాతీయంUSCIS new policy : అమెరికా కల కల్ల.. ఇండియాకు వెళ్లాల్సిందే.. గ్రీన్ కార్డు ముచ్చట...

USCIS new policy : అమెరికా కల కల్ల.. ఇండియాకు వెళ్లాల్సిందే.. గ్రీన్ కార్డు ముచ్చట తీరినట్లేనా?

USCIS new policy : యూఎస్‌లో గ్రీన్‌కార్డ్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా విడుదల చేసిన కొత్త పాలసీ మెమో ప్రకారం.. ఇకపై అమెరికాలో ఉండగానే ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా గ్రీన్‌కార్డ్‌ పొందడం అత్యంత కఠినంగా మారనుంది. సాధారణంగా గ్రీన్‌కార్డ్‌ కోరుకునే వారు ఇకపై తమ స్వదేశానికి వెళ్లి, అక్కడ ఉండే అమెరికా కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

USCIS new policy,

చట్టం అసలు ఉద్దేశ్యాన్ని మళ్లీ అమల్లోకి తెస్తున్నాం: USCIS

ఈ కొత్త కఠిన విధానాన్ని ప్రకటిస్తూ USCIS ప్రతినిధి జాక్ కాహ్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని మేము మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్నాం. తాత్కాలిక వీసాలపై (ఎఫ్1, హెచ్1బీ, బీ1 /బీ2 వంటివి) అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు లేదా పర్యాటకులు తమ వీసా గడువు పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లాల్సిందే. వారి తాత్కాలిక ప్రవేశం అనేది గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియకు తొలి అడుగుగా మారకూడదు.” అని USCIS ప్రతినిధి జాక్ కాహ్లర్ స్పష్టం చేశారు.

కొత్త నిబంధనల వల్ల మారే అంశాలు ఇవే

ఇప్పటివరకు అమెరికాలో లీగల్ స్టేటస్‌లో ఉంటూనే గ్రీన్‌కార్డ్‌కు (ఐ-485 ద్వారా) స్టేటస్ మార్చుకునే అవకాశం చాలా మందికి ఉండేది. కానీ తాజా మార్గదర్శకాలతో ఆ అవకాశాన్ని USCIS గణనీయంగా పరిమితం చేసింది. ఇకపై అత్యంత “అసాధారణ పరిస్థితులు” ఉన్నవారికి మాత్రమే అమెరికా లోపల స్టేటస్‌ అడ్జస్ట్‌మెంట్‌కు అనుమతి లభిస్తుంది. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా, అత్యంత కఠినంగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. నిబంధనలు వర్తించని వారు ఖచ్చితంగా భారత్ లేదా వారి స్వదేశాలకు వెళ్లి ‘కాన్సులర్ ప్రాసెసింగ్’ ద్వారానే గ్రీన్‌కార్డ్‌ తెచ్చుకోవాలి.

అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా మిగిలిపోయే వారి సంఖ్యను తగ్గించడం… USCIS బ్యాక్‌లాగ్‌లను తగ్గించి, సంస్థ వనరులను ఇతర ప్రాధాన్య కేసులపై ఉపయోగించడం… హింసా బాధితులు, మానవ అక్రమ రవాణా బాధితుల వీసాలు, పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు ప్రకటనలో తెలిపారు.

భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం!

ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయులపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గ్రీన్‌కార్డ్‌ బ్యాక్‌లాగ్‌లో దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయ టెకీలు (హెచ్-1బీ హోల్డర్స్), ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఈ కొత్త మార్పుతో తీవ్ర ఆందోళనలో పడ్డారు. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ కోసం అమెరికా వదిలి స్వదేశానికి వెళ్తే మళ్లీ అక్కడ వీసా రిజెక్ట్ అవుతుందేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కోర్టు మెట్లు ఎక్కనున్న కొత్త పాలసీ?

మరోవైపు USCIS తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వలసదారుల హక్కుల సంఘాలు దీనిపై కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల అమెరికాలో భారతీయులు సహా విదేశీయులు నిపుణులు మునుపటిలా స్వేచ్ఛగా ఉండడం.. పనిచేసుకోవడం చాలా కష్టంగా మారనుంది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper