US Iran conflict : ఒక అడవిలో కోతులు మొత్తం గుంపుగా ఉన్నాయి. ఒక కోతికి అనుకోని ఆపద వచ్చింది. దీంతో మిగతా కోతులు వెంటనే స్పందించాయి. ఆపద నుంచి కోతిని రక్షించాయి. దీనిని జంతు శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే జాతి పరమైన సంబంధం అంటారు.
ఉదాహరణకు ఒక కోతిని.. మరో జంతువు అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఒక మనిషి స్పందిస్తే.. ఆ జంతువు నుంచి కోతిని రక్షిస్తే.. దానిని ప్రకృతి విరుద్ధ సంబంధం అంటారు.. ప్రస్తుతం ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్ కోసం అమెరికా ప్రకృతి విరుద్ధ సంబంధాన్ని కొనసాగిస్తోంది.
యుద్ధం అనేది వ్యక్తుల అహాలను మాత్రమే సంతృప్తి పరుస్తుంది. దీర్ఘకాలంలో యుద్ధం వల్ల వినాశనం మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాలు.. జరగబోతున్న యుద్ధాలు సృష్టించింది కేవలం వినాశనం మాత్రమే. ఆయుధ వ్యాపారులు.. సామ్రాజ్యవాదులు లాభ పడితే పడి ఉండవచ్చు. అంతిమంగా ఏ దేశ ప్రజలకు కూడా లాభం లేదు. నష్టం తప్ప.. యుద్ధం వల్ల నష్టపోయిన దేశం పునర్నిర్మాణం కోసం ప్రజల మీద పన్నులు వేయాల్సి ఉంటుంది. యుద్ధం చేసిన దేశం కూడా ఆయుధాలు కొనుగోలు కోసం చేసిన ఖర్చును భర్తీ చేసుకోవడానికి ప్రజల మీద పన్నులు వేయాల్సిందే. ఇక్కడ సమిధలుగా మారింది ప్రజలు.. యుద్ధంలో ముందుండి నడిచింది సైనికులు.. రాక్షస ఆనందాన్ని పొందింది మాత్రం పాలకులు.
ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో అమెరికాకు ఎటువంటి నష్టం లేదు. అమెరికా ప్రవేశించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడో అట్లాంటిక్ సముద్రానికి దూరంగా ఉన్న అమెరికా.. మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్న ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం విసమెత్తు కూడా లేదు. కానీ, అమెరికా ప్రవేశించడానికి.. అత్యంత దారుణమైన దాడులు చేయడానికి ప్రధాన కారణం ఇజ్రాయిల్.
ఇజ్రాయిల్ మధ్య ఆసియా ప్రాంతంలో ఒక చిన్న దేశం. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అందువల్లే వాటి నుంచి కాపాడుకోవడానికి ఐరన్ డోమ్ అనే అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకుంది. అయినప్పటికీ ఇటీవల ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఐరన్ డోమ్ వ్యవస్థ మీద దాడి చేశారు. ఇజ్రాయిల్ పై బాంబుల వర్షం కురిపించారు. ఇక అప్పట్నుంచి ఇజ్రాయిల్ మేల్కొంది. తనకు శత్రువులుగా పరిగణించిన ప్రతి ఒక్కరిని అంతం చేయడం మొదలుపెట్టింది. తన అత్యంత కట్టుదిట్టమైన అంతరంగిక భద్రత వ్యవస్థ మొస్సాద్ ద్వారా శత్రువులను ఏరి పారేయడం మొదలుపెట్టింది. అయితే ఇరాన్ మొదటి నుంచి కూడా ఇజ్రాయిల్ దేశానికి శత్రువు గానే ఉంది. పైగా ఇటీవల ఐరన్ డోమ్ వ్యవస్థ మీద దాడి చేసిన ఉగ్రవాదులు ఇరాన్ దేశంలో ఆశ్రయం పొందారని ఇజ్రాయిల్ కు తెలిసింది. దీంతో ఇరాన్ మీద ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టింది.
సాధారణంగానే ఇజ్రాయిల్ మీద ఈగ వాలితే అమెరికా ఏమాత్రం సహించదు. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు.. బలమైన పునాదులు వేసింది.. అమెరికాను ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించేలా చేసింది యూదులు.. వీరిని ఇంగ్లీషులో జ్యూస్ అని పిలుస్తుంటారు.. యూదులు స్వతహాగానే అత్యంత తెలివైనవారు. ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలుగా పేరుపొందిన మెటా, గూగుల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలకు యజమానులుగా ఉన్నారు యూదులు. ఇజ్రాయిల్ దేశంలో యూదుల సంఖ్య అధికంగా ఉంటుంది. అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే యూదులు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. ఇజ్రాయిల్ దేశంలో యూధులకు ఎటువంటి ఆపద వచ్చినా సరే.. అమెరికా ప్రభుత్వాన్ని స్పందించేలా చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ యుద్ధం చేస్తోంది అంటే దానికి ప్రధాన కారణం యూదులు.
అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి మొదలుపెడితే ఫార్మారంగం వరకు అన్నింట్లోనూ యూదులు ఉన్నారు. వారంతా కూడా ఇజ్రాయిల్ మూలాలు కలిగి ఉన్నారు. అందువల్లే ట్రంప్ మరో మాటకు తావు లేకుండా యుద్ధం చేస్తున్నాడు. అమెరికా అప్పుల్లో ఉన్నప్పటికీ.. భారీగా వెచ్చించి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు. తెర ముందు ట్రంప్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. తెర వెనుక ఉన్నది మాత్రం యూదులు.. ఎందుకంటే వారు లేకపోతే అమెరికా లేదు. పొరపాటున యూదులు గనక అమెరికాను వదిలి వెళ్ళిపోతే.. అది స్మశాన దిబ్బగా మారిపోతుంది. అందువల్లే అమెరికా ఇజ్రాయిల్ కు సంఘీభావంగా యుద్ధంలోకి దిగింది.