Homeజాతీయ వార్తలుAligarh Muslim University: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోకి తుపాకులు ఎలా వచ్చాయి? ఏంటా కథ?

Aligarh Muslim University: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోకి తుపాకులు ఎలా వచ్చాయి? ఏంటా కథ?

Aligarh Muslim University: యూనివర్సిటీలు అంటే ఉన్నత విద్యా కేంద్రాలు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే విద్యా నిలయాలు. కానీ మన దేశంలో కొన్ని యూనివర్సిటీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకప్పుడు దేశభక్తిని, జాతీయ వాదాన్ని పెంపొందించిన యూనివర్సిటీలు ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారతున్నాయి. ఢిల్లీలోని జేఎన్‌టీయూ, అల్‌ఫలా యూనివర్సిటీల్లో జరిగిన కార్యకలాపాలే ఇందుకు నిదర్శనం.

అలీగఢ్‌లో హాస్టల్‌లో ఉగ్ర జాడలు..
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్‌లో పోలీస్‌లు ఇటీవల జరిపిన తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. హాస్టల్‌లోని ఓ గదిలో వాడేందుకు సిద్ధమైన బుల్లెట్లు, పిస్తోల్‌ మ్యాగజిన్‌లు, నకిలీ కరెన్సీ నోట్లు, ఫోర్జరీ పత్రాలు, 8 మొబైల్‌ ఫోన్లు లభించాయి. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, ఈ పదార్థాలు దాచి ఉన్నాయి. ఇటీవల యూనివర్సిటీకి సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలతో లింక్‌ భావిస్తున్నారు.

షెహబాజ్‌ అనుమానాస్పద చర్యలు
హాస్టల్‌ రూమ్‌లో షెహబాజ్‌ అనే వ్యక్తి ఉండటం అతి అసాధారణం. అధికారిక విద్యార్థి కాకుండా, నకిలీ డాక్యుమెంట్లతో అక్రమంగా ఉంటున్నాడు. రాత్రి మాత్రమే బయటకు వెళ్లి, పగలు రూమ్‌లో దాక్కోవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు అతని సిమ్‌ కార్డులు, కాల్‌ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను ట్రాక్‌ చేస్తున్నారు. అతను తప్పించుకున్నాడు.

ఇక్కడే విభజన మూలాలు..
ఈ యూనివర్సిటీ 1920లో స్థాపించబడింది,రాజా మహేంద్రప్రతాప్‌ దీనిని స్థాపించాడు. కానీ యూనివర్సిటీలో అతని పొటో లేదు. ఇక్బాల్‌ రెండు దేశ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రచారం చేశాడు. షేక్‌ అబ్దుల్లా కశ్మీర్‌ విభజనకు కారణమైనవాడు. దేశ విభజనకు కారణమైన జిన్నా ఫొటో ఉంది. ఇక్కడ చదివే హిందూ విద్యార్థులు మతపరమైన వివక్షకు గురవుతున్నారు.

భద్రతా లోపాలపై విచారణ..
యూనివర్సిటీ నిర్వహణలో గ్రేట్‌ ల్యాప్స్‌. హాస్టల్స్‌లో ఐడీ వెరిఫికేషన్‌ లేకపోవడంతో ఉగ్రవాదులు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇలాంటి కేంద్రాలు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. దొరికిన మొబైల్స్‌లోని డేటా వెల్లడి చేస్తే పెద్ద నెట్‌వర్క్‌ బయటపడవచ్చు. పోలీసులు ఎన్‌ఐఏతో కలిసి విచారణ జరుపుతున్నారు.

యూనివర్సిటీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ ఐడీ, రెగ్యులర్‌ రైడ్‌లు చేయాలి.
కఠిన నిబంధనలు అమలు చేయాలి. విద్యార్థులను దేశభక్తి మార్గంలో మళ్లించాలి. ఉగ్ర కార్యకలాపాలకు యూనివర్సిటీలు అడ్డాగా మారకుండా చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version