
కరోనా పై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్ కు వంద మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.