
కొవిడ్ కు కళ్లెం వేసే సరికొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కరోనా వైరస్ ను మాయ చేసి, తుదముట్టించే నానోట్రాప్ కణాలను వారు సృష్టించారు. సాధారణంగా మానవ కణాలపై ఏసీఈ 2 అనే రిసెప్టార్ ప్రొటీన్ లకు కరోనా వైరస్ అతుక్కుంటుంది. అక్కడి నుంచి అది కణంలోకి ప్రవేశిస్తుంది. తాజా పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఏసీఈ2 సాంద్రత ఎక్కువగా ఉండే నానోకణాలను తయారు చేశారు.