కేరళ కాంగ్రెస్ లో ఊహించని పరిణామం
కేరళలోని కాంగ్రెస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన నేతలు వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలు లేకుండానే లోక్‌సభ ఎంపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కన్వీనర్ బెన్నీ బెహానన్ రాజీనామా చేశారు. ఈయన రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె. కరుణాకరన్ కుమారుడు కె. మురళీధరన్ కూడా కేపీసీసీ మీడియా ప్రచార కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వీరు […]
Written By:
, Updated On : September 28, 2020 / 07:03 PM IST

కేరళలోని కాంగ్రెస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన నేతలు వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలు లేకుండానే లోక్‌సభ ఎంపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కన్వీనర్ బెన్నీ బెహానన్ రాజీనామా చేశారు. ఈయన రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె. కరుణాకరన్ కుమారుడు కె. మురళీధరన్ కూడా కేపీసీసీ మీడియా ప్రచార కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు