
కరోనా కారణంగా మూసివేసిన పాఠశాలలను అక్టోబర్ 5నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి అధిమలుపు సురేష్. ఇప్పటికే 9,10, ఇంటర్ విద్యార్థులకు పాక్షింగా తరగతులు ప్రారంభం కాగా నవంబర్ 1నుండి ఉన్నత విద్య తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయులు 50% మాత్రమే హాజరవాల్సి ఉంటుందని మంత్రి సురేష్ గారు పేర్కొన్నారు.