
అఫ్గానిస్థాన్ నుంచి తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు వచ్చిన ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్ కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఈ విమానాన్ని కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవో జెనీ యెనిన్ తెలిపారు. గత ఆదివారం మా విమానాన్ని కొంతమంది హైజాక్ చేశారు. మంగళవారం ఆ విమానం మా నుంచి దొంగలించి ఇరాన్ తీసుకెళ్లారు. అందులో ఉన్న ప్రయాణికులు కూడా ఉక్రెయిన్ దేశస్థులు కాదు. మా పౌరులకు బదులుగా వేరే ప్రయాణికులను తీసుకుని వెళ్లిపోయారు. అని యెనిన్ చెప్పినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ కథనం వెల్లడించింది. హైజాకర్ల వద్ద ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.