
ఫ్యాక్షన్ రక్కసికి ఇద్దరు బలయ్యారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్చుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణ హత్య చేశారు. భూ వివాదంపై తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. హత్యకు గురైన ఇద్దరు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పికెటింగ్ ఏర్పాటు చేశారు.