
జమ్ముకశ్మీర్ లోని బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులు హతమయ్యారు. బందిపొరాలోని శోక్ బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. దీంతో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పారు.