
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం 6,000 రూపాయలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అందించే 6,000 రూపాయలు పొందేవాళ్లు ఈ స్కీమ్ ద్వారా సులువుగా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది.
పీఎం కిసాన్ స్కీమ్ లబ్దిదారులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా సులువుగానే రుణాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకోవడం ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉండగా బ్యాంకులకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు పొలం పట్టా, బ్యాంక్ పాస్ బుక్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గరిష్టంగా రూ.3 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ కార్డును పొందేవాళ్లు సబ్సిడీ రూపంలో తగ్గింపును పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ పై 2 శాతం వడ్డీ రాయితీని అందిస్తుండగా కరెక్ట్ టైమ్ కు రుణం చెల్లిస్తే వడ్డీ రేటు మళ్లీ 3 శాతం తగ్గి కేవలం 4 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
అంటే ఈ వడ్డీరేటు చాలా తక్కువ వడ్డీరేటు అని చెప్పవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా డబ్బులు పొందుతున్న వాళ్లు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.