
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనర్ సమీపంలో టెర్రరిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీ నగర్ లోని కన్మోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్ పీఎఫ్ బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు చేపట్టారు. టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని వెల్లడించారు.