
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలివుడ్ గాయకుడు నిక్ జోనాస్ కు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఘాటింగ్ సెట్ లో ప్రమాదం జరగడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్స్ చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమవారం నిక్ తన రియాలిటీ షో ది వాయిస్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ప్రియాంక తను కమిటైన ప్రాజెక్ట్స్ కోసం లండన్ లో ఉంది. నిక్, ప్రయాంక చోప్రా 2018 లో వివాహం చేసుకోగా, ప్రియాంక కన్నా నిక్ 10 సంవత్సారా చిన్నవాడన్న సంగతి తెలిసిందే.