
అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు దాఖలు చేసేందుకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. విచారణను ఈనెల 26 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.