
ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని రూర్కీ ప్రైవేటు హాస్పిటల్ లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా ఐదుగురు కోవిడ్ పేషంట్లు మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.30 నుంచి 2 గంటల మధ్యలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. అరగంట అంతరాయంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు వెంటిలేటర్ పై, నలుగురు ఆక్సిజన్ పై ఉన్నారని అంటున్నారు.