
ఎవరెస్టు శిఖరంపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మరణించారు. ఒకరు అమెరికాకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు స్విట్జర్లాండ్ కు చెందిన అధిరోహికుడు. వీరిద్దరూ అలసటతో మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. ఎవరెస్టు శిఖరంపైకి ఎక్కిన తర్వాత స్విట్జర్లాండ్ అధిరోహికుడు, హిల్లరీ క్యాంపు అమెరికా అధిరోహికుడు మరణించాడు. గత వారం 30 మందికి పైగా అధిరోహికులు అనారోగ్యానికి గుురయ్యారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి మాత్రమే పాజిటివ్ గా నిర్ధారణ అయింది.