https://oktelugu.com/

కాంగ్రెస్ నేతలకు ట్విట్టర్ షాక్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ఇప్పటికే లాక్ చేసిన ట్విట్టర్ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ సీనియర్ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. పార్టీ మీడియా హెచ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 12, 2021 / 01:08 PM IST
    Follow us on

    ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ఇప్పటికే లాక్ చేసిన ట్విట్టర్ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ సీనియర్ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. పార్టీ మీడియా హెచ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్, టీపీసీసీ నేత పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ట్విట్టర్ చీఫ్ జాక్ డోర్సే పై విమర్శలు గుప్పించారు.