పలువురికి ట్విటర్ నోటీసులు
ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్, ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ సహా పలువురికి ట్విటర్ నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో వారి ట్వీట్లను తొలగించాలని ప్రభుత్వ ఏజెన్సీలు సూచించిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. అయితే, ఏ సంస్థలు అడిగాయనే వివరాలను మాత్రం ట్విటర్ పేర్కొనలేదు. ట్విటర్ నుంచి తమకు అందిన నోటీసులను మంజుల్, జుబైర్ తదితరులు షేర్ చేశారు.
Written By:
, Updated On : June 12, 2021 / 08:52 PM IST