
తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ) పరిధిలోని కళాశాలల్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ, పీజీ, బీఈడీ పరీక్షలను వాయిదా వేస్తూ వర్సటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా ఇవాళ, రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయో త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.