సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ జలాశయంలో మంత్రులు తలసాని, హరీశ్ రావు చేప, రోయ్యల పిల్లలను వదిలారు. తెలంగాణ చేపలు, రోయ్యల నాణ్యత బాగుంటుందని, వాటికి మంచి డిమాండ్ ఉందని హరీశ్ అన్నారు. మత్స్య రంగానికి ఊపిరి పోసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. సీఎం చొరవతోనే నీలివిప్లవానికి ఊపిరిపోశామన్నారు.