Trivikram Srinivas : కామెడీ సినిమాలను ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంలో అనిల్ రావిపూడి దిట్ట… ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సైతం అదే జానర్ లో వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి. అందువల్లే అనిల్ రావిపూడి ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటూ సినిమాలను చేస్తుంటాడు. ఇక ప్రొడ్యూసర్లతో సైతం భారీ బడ్జెట్ పెట్టించకుండా చాలా తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను చేస్తూ వారిని సేఫ్ జోన్ లో ఉంచుతాడు. మొత్తానికైతే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపి ప్రొడ్యూసర్లకు లాభాల పంట పండేలా చేస్తున్నాడు… అందుకే అతనికి ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులు సైతం అతని సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. కాబట్టి స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలందరికి సక్సెస్ లను సాధించి పెడుతున్న ఆయన యంగ్ హీరోలతో కూడా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక ఆయన సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేసినప్పటికి మరి కొంతమంది అతన్ని ట్రోల్ చేసిన కూడా అతని సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఆ సినిమాలను చూసి ప్రేక్షకులు సూపర్ సక్సెస్ లను కట్టబెడుతున్నారు. ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి దినదినాభివృద్ధి చెందుతున్నాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను సాధించాడు. తన మాటలను తూటాల్లా పేలుస్తూ ప్రేక్షకుడి హృదయాలను గెలుచుకున్నాడు.
కామెడీ సీన్స్ రాయడం లో తనను మించిన వారు మరెవరు లేరు అనేంతలా తన పెన్నుతో కామెడీ పంచులను రాస్తాడు… ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైతం అనిల్ రావిపూడి సినిమా స్టైల్ లోనే ఉండబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి.
అదేంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతూ తన సమకాలీన దర్శకుడిని అనుసరిస్తూ సినిమా చేయడం అనేది సరైనదేనా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక దానికి కౌంటర్ గా మరి కొంతమంది నిజానికి మొదట కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారిందే త్రివిక్రమ్ శ్రీనివాస్… అతని బాటలోకే అనిల్ రావిపూడి వచ్చాడు.
మధ్యలో త్రివిక్రమ్ అతను తన స్టైల్ ని మార్చి వేరే జానర్ సినిమాలను చేశాడు. అంతే తప్ప త్రివిక్రమ్ ఫుల్ టైం కామెడీ సినిమాలను చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి వెంకటేష్ సినిమాతో చూపించబోతున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ మరోసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
