Travel Dysmorphia : ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ప్రతి మనిషిలో ఎన్నో రకాల ఒత్తిడిలు ఉంటున్నాయి. నేటి కాలంలో అయితే స్కూల్ విద్యార్థులు కూడా చదువు విషయంలో టెన్షన్ పడుతున్నాడు. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి.. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి వీకెండ్ టూర్ వేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొందరు నాన్ వెస్కొని ట్రిప్పుకు వెళుతూ ఉంటారు. అయితే ఒకరు విహారయాత్రలకు వెళ్తే.. తమ సమీప బంధువులు లేదా స్నేహితులు.. తాము వెళ్లడం లేదని బాధ ఉంటుంది. అలాగే కొందరు ఎక్కువగా టూర్లు వేస్తుంటే.. తాము వేయలేకపోతున్నామని అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకోవడాన్ని Travel Dysmorphia అని అంటారు. అసలు ఇది ఎలా కలుగుతుంది? ఇది రావడం వల్ల ఇబ్బంది ఏంటి? ఈ సమస్య తొలిగిపోవాలంటే ఏం చేయాలి?
ఒకప్పుడు డబ్బు ఉన్న వారు మాత్రమే విహారయాత్రలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు నెలకు లేదా ఏడాదికి కొన్నిసార్లు అయినా టూర్ వెయ్యాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏది వీలు కాకపోతే ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటున్నారు. అయితే కొందరు ఇలా టూర్లు వేస్తుండగా.. వేరే స్టేటస్ ను చూస్తూ బంధువులు లేదా స్నేహితులు ఒక రకంగా తాము టూర్లు వేయడం లేదని అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మిగతా వారి కంటే తాము తక్కువగా విహార యాత్రలకు వెళ్తున్నామని అనుకుంటున్నారు. ఇది క్రమంగా వారిలో మానసికంగా ఇబ్బందిని గుర్తు తెచ్చే కాడికి వస్తుంది.
ఇటీవల కొందరు వైద్యులు ఎక్కువగా టూర్ల గురించి మాట్లాడే వారిపై పరిశోధనలు చేయగా వారిలో Travel Dysmorphia సమస్య ఉన్నట్లు గుర్తించారు. అంటే మీరు ఎక్కువగా సమీపంగా ఉన్నవారు విహారయాత్రలకు వెళ్తే తట్టుకోలేకపోతున్నారు. పాము కూడా టూర్లు వేయాలని విపరీతంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల వ్యాధులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఉన్నవారు కొత్తగా ఇలాంటి సమస్యతో కూడా బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే లేదా వచ్చినా కూడా తొలగిపోవాలంటే ఇలా చేయాలి.
విహారయాత్ర అనేది మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కొందరు ఎప్పటికీ విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా విహారయాత్రలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. సమయాన్ని వృధా చేసిన వారు అవుతారని అంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని ఇతరులు టూర్స్ కు వెళ్తున్నా కూడా వారి గురించి పెద్దగా పట్టించుకోవద్దని అంటున్నారు. అలాగే ఇప్పటికే Travel Dysmorphia సమస్య ఉన్నవారు దగ్గర్లోని కొత్త ప్రదేశాలకు వెళ్లడం మంచిది. లేదా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికీ టూర్స్ వేయాలని అనుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు అని అంటున్నారు. ఎప్పటికీ టూర్స్ వేసే వారిలో మానసిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయని అంటున్నారు.