Family Man 3 Web Series Full Review: నటీనటులు : మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, జైదీప్ ఆహ్లావత్ తదితరులు…
డైరెక్టర్స్ : రాజ్ – డీకే
మ్యూజిక్ డైరెక్టర్ : సచిన్ జిగార్
సినిమాటోగ్రఫీ : జై చరోలా…
ఇంతకుముందు ఇండియాలో వెబ్ సిరీస్ లకు పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ వచ్చిందో అప్పటినుంచి సిరీస్ లకు సైతం ఆదరణ భారీగా పెరిగిపోయింది. మొత్తానికైతే ఈ సిరీస్ సైతం ఇప్పుడు సినిమాలతో పాటు పోటీపడి హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను అందుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రాజ్ – డీకే క్రియేట్ చేసిన ఈ సిరీస్ మొదటి రెండు సీజన్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం మూడో సీజన్ సైతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఎలా ఉంది మొదటి రెండు సీజన్ల మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనేది తెలుసుకుందాం పదండి…
కథ
ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పడిన అలజడులను అడ్వాంటేజ్ గా తీసుకున్న చైనా ‘గువాన్ యు’ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తోంది…దీంతో దేశం లో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్న చైనా కి పోటీగా ఇండియా ‘ప్రాజెక్ట్ సహకార్’ అనే మిషన్ ను స్టార్ట్ చేస్తోంది… ఇందులో నేషనల్ ఇంటిలిజెన్స్ అధికారిగా కులకర్ణి నియమించబడతాడు…ఇక ఇదే సమయంలో ‘ఏజెంట్ శ్రీకాంత్’ (మనోజ్ బాజ్ పాయ్) నాగాలాండ్ కి వెళ్లి అక్కడి రెబల్ నాయకులతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక అదే సమయంలో వీళ్ళ మీద దాడి జరుగుతోంది. ఆ దాడిలో కులకర్ణి తో పాటు రెబల్ నాయకుడు మరణిస్తాడు. ఏజెంట్ శ్రీకాంత్ ప్రాణాలతో బయటపడతాడు…ఇక దీంతో ఈ దాడి వెనక శ్రీకాంత్ హస్తం ఉందని తను పని చేసే టాస్క్ టీమ్ భావిస్తోంది. దాంతో శ్రీకాంత్ మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు…ఇక ఇప్పటిదాకా దేశం కోసం పనిచేసిన శ్రీకాంత్ ఇప్పుడు దేశద్రోహి గా ముద్రించబడతాడు…అలాగే తన ఫ్యామిలీ కూడా చాలా వరకు సఫర్ అవుతారు… మరి శ్రీకాంత్ ఆ దాడికి తనకి ఏం సంబంధం లేదని ప్రూవ్ చేస్తాడా..? అలాగే దీని వెనక ఎవరున్నారు అనేది తెలుసుకొని వాళ్ళను పట్టుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…
విశ్లేషణ
ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్స్ ప్రేక్షకుల యొక్క అభిరుచి మేరకు డైరెక్టర్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు… ముఖ్యంగా ఇది ఒక థ్రిల్లర్ జానర్ లో సాగినప్పటికి ప్రేక్షకులను మాత్రం ఎక్కువగా ఎంటర్ టైన్ చేస్తూనే ఈ సిరీస్ ను ముందుకు తీసుకెళ్లారు…మొదటి రెండు సీజన్లు చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ సీజన్ మీద ప్రతి ఒక్కరికి హైప్ ఉంటుంది…మణిపూర్ అల్లర్లను బేస్ చేసుకొని ఈశాన్య రాష్ట్రాల్లోని కథలను బాలీవుడ్ వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు… ప్యామిలీ మ్యాన్ సిరీస్ ఈ సీజన్ లో ఏడు ఎపిసోడ్స్ తో వచ్చింది. అందులో మొదటి రెండు ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక మొదటి రెండు సీజన్లలో ఉన్న విలనిజం కొంతవరకు ఇందులో మైనస్ అయింది… ఈ సీజన్ లో రుక్మాంగద అనే పాత్రలో జైదీప్ ఆహ్లావత్ లాంటి విలన్ ను తీసుకున్నారు. ఇక ఆయన ఇంట్రడక్షన్ బాగుంది…
కానీ ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్ది ఆయన క్యారెక్టర్ చాలా వీక్ గా అనిపించింది…క్యారెక్టర్ యొక్క ఆర్క్ మారకుండా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం బాగుండాలి అలాంటప్పుడే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుతోంది…మూడు, నాలుగోవ ఎపిసోడ్స్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి…అలాగే కొన్ని ట్విస్టు లు సైతం ప్రేక్షకులను మెప్పిస్తాయి… అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సైతం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి…
ఇక మనోజ్ బాజ్ పాయ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… ఎందుకంటే ఏజెంట్ శ్రీకాంత్ అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది. తను తప్ప ఆ పాత్రను ఎవ్వరు చేయలేరు. వేరేవాళ్ళు చేసిన జనాలు ఆ పాత్ర ను అంతా ఓన్ చేసుకోలేరు. కాబట్టి మనోజ్ బాజ్ పాయ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్లో చేశాడు…జైదీప్ ఆహ్లావత్ యాక్టింగ్ కూడా బాగుంది.
తన పాత్ర కి ఇంకా స్కోప్ ఉంటే ఆయన ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవాడు…ప్రియమణి పాత్ర సైతం ప్రేక్షకులను అలరిస్తోంది… విజువల్స్ ప్రకారం చూసుకుంటే ఈ సిరీస్ చాలా పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించారు…ఇక మ్యూజిక్ కూడా బాగుంది…ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండటం తో ఈ సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది…
ఈ సిరీస్ లో బాగాలేనివి ఇవే
విలన్ క్యారెక్టర్ లో క్లారిటీ మిక్స్ అయింది…
చివరి ఎపిసోడ్స్ బాగా లాగ్ అయ్యాయి…
ఈ సిరీస్ లో బాగున్నవి ఇవే
కథ
మనోజ్ బజ్ పాయ్ యాక్టింగ్
యాక్షన్ సీక్వెన్స్…
రేటింగ్ : 2.75/5
ఒక ఇంటెన్స్ అటెంప్ట్ ఇచ్చారు…ఫ్యామిలీ మ్యాన్ మొదటి రోజు సీజన్స్ నచ్చిన వాళ్ళకి ఈ సీజన్ కూడా బాగా నచ్చుతుంది…